భారతదేశం, ఏప్రిల్ 5 -- చదువుకుంటూనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పని చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం! భారత ప్రభుత్వం ప్రస్తుతం రెండు కీలక విభాగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇంకార్పొరేటెడ్ (ఎంఈఐటీవై-ఎన్​ఐసీఎస్​ఐ) ఈ నోటిఫికేషన్లను విడుదల చేశాయి.

భారతదేశ జాతీయ రహదారుల అభివృద్ధిలో ప్రత్యక్ష అనుభవం సంపాదించాలనుకునే వారి కోసం ఎన్​హెచ్​ఏఐ ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించింది.

అర్హతలు: ఇంజనీరింగ్, ఐటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మేనేజ్మెంట్, లా, కామర్స్ వంటి విభిన్న విభాగాల విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

గడువు: ఏప్రిల్ 15, 2026 లోపు అధికారిక పోర్టల్ ద...