Telangana,hyderabad, సెప్టెంబర్ 28 -- తెలంగాణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను విర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నైపుణ్యం పెంచుక...