భారతదేశం, జూన్ 10 -- యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో మందమర్రిలో ATC (Advanced Training Center) సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, భాషా శిక్షణ, ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టామ్‌కామ్ ఆధ్వర్యంలో మందమర్రిలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీలో ఉద్యోగాలు, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ శిక్షణ కేంద్రం కీలకంగా మారనుంది.

జర్మన్ భాషపై పట్టు సాధించడం ద్వారా విద్యార్థులు, యువత ప్రపంచ స్థాయి ఉద్యోగ మార్కెట్‌లో పోటీ పడే అవకాశం పొందుతారు. భాషా నైపుణ్యాలతో పాటు ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్, విదేశీ ఉద్యోగాల కోసం అవసరమైన మార్గదర్శకత్వం కూడా అం...