Telangana,hyderabad, ఆగస్టు 1 -- రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు కూడా జూలై 31వ తేదీ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బోర్డు గురువారం ప్రకటన విడుదల చేసింది. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. అర్హులైన టెన్త్ విద్యార్థులు. వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఆ తర్వాత గడువును మళ్లీ పెంచే అవకాశం లేదని పేర్కొంది.

ఇంటర్మీడియట్ బోర్డు తాజా నిర్ణయంతో. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్, ఇతర జూన...