భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఢిల్లీలోని ఒక ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి, ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకునే స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథిపై లైంగిక వేధింపులు, వేధింపులు, మోసపూరిత వ్యవహారాలపై కేసు నమోదైంది. వసంత్ కుంజ్‌లోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో చదువుకుంటున్న కనీసం 17 మంది విద్యార్థినులను అతను లైంగికంగా వేధించాడని పోలీసులు అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

ఈ కేసులోని అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు మహిళల హాస్టల్‌లో రహస్య కెమెరాలను అమర్చాడు. సెక్యూరిటీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కెమెరాల ద్వారా అమ్మాయిల కదలికలను గమనిస్తూ.. విద్యార్థినులను అతని కోరికలకు ఒప్పుకునేలా బెదిరించేవారని ఎఫ్‌ఐఆర్‌...