భారతదేశం, సెప్టెంబర్ 25 -- విదేశీ విశ్వ విద్యాలయాల్లో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి పథకం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ విదేశీ యూనివర్సిటీల్లో షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల స్కాలర్‌షిప్ అందిస్తుంది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఈ స్కీమ్ అమలవుతోంది.

యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులల్లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు చదువుకోవచ్చు. ఈ పథకం కోసం విద్యార్థుల నుంచి ముందుగా 31-08-25 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే తాజాగా 23-09-2025వ తేదీ నుంచి 19-11-2025 వరకు గడువును పొడిగించారు.

అర్హతగల విద్యార్థుల...