భారతదేశం, జూన్ 17 -- ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే కొత్తగా సుమారు 2.20 లక్షల మందికి వితంతు కేటగిరీ కింద పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు.

కొత్త వితంతు పింఛన్లకు సంబంధించి ఇప్పటికే అర్హులను గుర్తించామని, రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో వీరికి నేరుగా లబ్ధి చేకూరేలా నూతన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా సామాజిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే మనం రెట్టింపు స్థాయిలో పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో దాదాపు 9.56 లక్షల మంది పింఛన్లను తొలగించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 7,856 అనర్హుల పింఛన్లను మాత్రమే తొలగ...