భారతదేశం, సెప్టెంబర్ 27 -- తమిళనాడు, కరూర్: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కరూర్ జిల్లాలో జరిగిన భారీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘోర దుర్ఘటనలో కనీసం 31 మంది మరణించారు. దాదాపు 40 మంది గాయాల పాలయ్యారు.

చనిపోయిన వారిలో 16 మంది మహిళలు, తొమ్మిది మంది పురుషులు, ఆరుగురు చిన్నారులు ఉన్నారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ ధృవీకరించారు.

జిల్లా యంత్రాంగం 'తొక్కిసలాట లాంటి పరుగు'గా అభివర్ణించిన ఈ ఘటన కరూర్-ఈరోడ్ హైవేలోని వెలుసామీపురం వద్ద జరిగింది. విజయ్ 'వెళిచ్చం వెళియెరు' ('వెలుగు రావాలి') పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రచార సభకు వేలాది మంది తరలివచ్చారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే గందరగోళం చెలరేగింది. దీంతో...