భారతదేశం, జనవరి 29 -- దళపతి విజయ్ రాజకీయాల్లోకి (టీవీకే పార్టీ) వెళ్లే ముందు నటిస్తున్న చివరి మూవీ కావడంతో 'జన నాయగన్' (Jana Nayagan)పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు ఎదురయ్యాయి. "మా చేతిలో లేని అనివార్య కారణాల వల్ల" సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మద్రాస్ హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్నా, విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ మౌనం వీడాడు.

దళపతి విజయ్ తండ్రి, డైరెక్టర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. "కరూర్ లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. విజయ్ దేనికీ భయపడడు. అతని విజయావకాశాలు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి ఇలాంటి అడ్డంకులు ఎదురవడం సహజమే. విజయ్ ఇలాంటి ఎన్ని అడ్డంకులనైనా ఎ...