భారతదేశం, నవంబర్ 3 -- తీవ్ర తుపాను 'మురాసు' ప్రభావంతో విజయవాడ నగరంతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన వాన మంగళవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా కొనసాగింది. దీంతో విజయవాడలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలో కీలకమైన బందర్ రోడ్, పాలిక్లినిక్ రోడ్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లపైకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వన్‌టౌన్‌లోని ప్రధాన వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది.

మరోవైపు తీవ్ర తుపానుగా మారిన 'మురసు' దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొచ్చి ఒంగోలు సమీపంలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో స...