విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. కొత్త నిబంధన!
భారతదేశం, ఆగస్టు 14 -- ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భద్రతను పటిష్టం చేస్తూ, భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్ ఫోన్లు తీసుకువెళ్లడంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఈ మేరకు ఆలయ ఈవో సీనా నాయక్ కీలక ప్రకటన విడుదల చేశారు.
దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను పెంపొందించడం, అలజడి లేకుండా ప్రశాంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంలో సరికొత్త సెక్యూరిటీ స్కానింగ్ గేట్ ఏర్పాటు చేశారు. హోం గార్డులు, ఏజైల్ సెక్యూరిటీ సిబ్బంది ఈ గేట్ వద్ద భక్తులను నిశితంగా తనిఖీ చేస్తారు. స్కానింగ్ పాయింట్ దాటి ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.