భారతదేశం, అక్టోబర్ 14 -- విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రికి వచ్చిన రాష్ట్రపతి కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ పాలకమండలి తరఫున ఘనస్వాగతం లభించింది.

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా గాంధీ, ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా స్వాగతం పలికారు.

స్వాగత సత్కారాల అనంతరం రాష్ట్రపతి ఆలయ అంతరాలయంలోకి వెళ్ళి శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దేశ శ్రేయస్సు, ప్రజల క్షేమాన్ని ఆక...