భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు దసరా ఉత్సవాలకు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ దేవీ నవరాత్రులు రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక విజయవాడ ఉత్సవ్‌ కోసం ఘనంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.

దసరా ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది. మరోవైపు మరింత శోభ తెచ్చేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. 286 ఈవెంట్స్‌తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివల్‌గా ప్రకటించారు. కృష్ణా నది తీర ప్రాంతంలోని పున్నమీ ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, సంగీత కళాశాల.. ఇలా పలు ప్రాంతాల్లో వేడుకలు జరుగుతాయి. సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొండపై అమ్మవారిని దర్శించుకుని తర్వాత విజయవాడ్ ఉత్సవ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

ట్రాఫిక్ సమస్యలు ...