Andhrapradesh,vizianagaram, ఆగస్టు 6 -- బంగారు ఆభరణాల విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి తన బంధువును నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

కొత్తవలస మండలం మూసీరం గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన జరిగింది. సిమ్మ అప్పారావు అనే వ్యక్తి తన నగలు తిరిగి ఇవ్వలేదనే కోపంతో మేనమామ సోదరుడైన ఎస్ అప్పారావు (60)ను హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిమ్మ అప్పారావు భార్య ఏడాది క్రితం మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె ఉంది. భార్య చనిపోవడంతో ఆమె బంగారు నగలను తన బంధువు అయిన అప్పారావు వద్ద భద్రపరిచాడు.

ఇటీవల తన కుమార్తెకు యుక్తవయస్సు వచ్చిందని. స్థానిక ఆచారం ప్రకారం రజస్వల వేడుకను జరుపుకోవాలని భావించిన సిమ్మ అప్పారావు నగలు తిరిగి ఇవ్వాలన...