భారతదేశం, అక్టోబర్ 19 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో విజయదశమి కూడా ఒకటి. హిందువులు భక్తిశ్రద్ధలతో దసరా పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా విజయదశమిని జరుపుకుంటారు. రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా ఈ విజయదశమికి ప్రాధాన్యత ఉంది. అయితే, విజయదశమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు ఆరోజు ఏం చేయాలి వంటి వివరాలను కూడా తెలుసుకుందాం.

దశమి తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:50 నుంచి దశమి తిథి అక్టోబర్ 21 మధ్యాహ్నం 2:11 వరకు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే, అక్టోబర్ 20న విజయదశమిని జరుపుకోవాలని నిర్ణయించారు. మైసూర్‌లో కూడా అక్టోబర్ 21న విజయదశమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

విజయదశమి నాడు పూజలు, శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. విజయద...