భారతదేశం, అక్టోబర్ 2 -- దేశవ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా రోజున రావణుడిని రాముడు, మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించడం ద్వారా ధర్మాన్ని రక్షించారని చెబుతారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకొంటారు. ఇది అహంకారం, చెడుపైవిజయాన్ని సూచిస్తుంది. అధర్మంపై ధర్మం సాధించిన గెలుపుగా సూచిస్తారు. జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోవాలని వేడుకుంటారు. మీరు కూడా విజయదశమి రోజున మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలపండి.

సర్వస్వరూపిణీ సర్వేశు సర్వశక్తిసమాన్వితే..

భయోభ్య శ్రీహీ నో దేవీ దుర్గా దేవి నమోస్తుతే..

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!

శమీ శమయతే పాపం శమీ శతృ వినాశినీ..

అర్జునస్య ధనుర్థారి రామస్య ప్రియదర్శిని..

శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా..

దారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.....