భారతదేశం, మార్చి 9 -- చాలామంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు. నిజానికి ఇంట్లో పెట్టే వస్తువులను సరైన దిశలో పెడితే ఇబ్బందులు కలగవు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను సరిగ్గా ఉంచినట్లయితే సానుకూల మార్పులను చూడొచ్చు. అనేక విధాలుగా ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇళ్లల్లో చాలా మంది చేపల తొట్టెలు పెడుతూ ఉంటారు. అక్వేరియం చేపల తొట్టెల్లో చేపల్ని పెంచడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఇత్తడి చేపలను పెట్టినా కూడా మంచి జరుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఇత్తడి చేపలను మీరు చూసే ఉంటారు. ఈ సంప్రదాయం కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.

ఈ చేపలు కేవలం అలంకరణకు మాత్రమే కాదు, సానుకూల శక్తి మరియు శ్రేయస్సును కూడా ఇవి తీసుకు వస్తాయని నమ్మకం. ఇత్తడి చేపలు ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, వాటిని ఇంట్లో పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమా...