భారతదేశం, జూన్ 23 -- ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, ప్రశాంతత, ఆర్థిక శ్రేయస్సు ఉండాలని అందరం కోరుకుంటాం. ఇందుకోసం దేవునికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు, నైవేద్యాలు సమర్పించడంలాంటివి చేస్తుంటాం. అంతేకాదు వాస్తును సైతం ఫాలో అవుతారు చాలా మంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం కేవలం దేవుడిని పూజించడం మాత్రమే సరిపోదు, మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనం ఉంచే కొన్ని చిన్న వస్తువులకు మన అదృష్టాన్ని మార్చే శక్తి ఉంది.

ఇంటి గుమ్మం వద్ద ఉంచే డోర్ మ్యాట్, రాయి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చాలా మందికి తెలియదు. ఇంటి ప్రధాన ద్వారం కేవలం ప్రవేశ ద్వారం మాత్రమే కాదు, దాని ద్వారానే సానుకూల శక్తి, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందువల్ల ప్రధాన ద్వారం వాస్తు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నిరోధించడం...