భారతదేశం, సెప్టెంబర్ 17 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలామంది ఇంట్లో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిని నిర్మించేటప్పుడు కచ్చితంగా వాస్తు చూసుకోవాలి.

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే, మెట్లు ఏ దిశలో ఉండాలి అనేది కూడా వాస్తు ప్రకారం చూసుకోవడం మంచిది. అలాగే, చాలా మంది మెట్ల కింద అనవసరమైన వస్తువులు, డస్ట్ బిన్లు, పనికిరాని సామాన్లు ఇలాంటివి పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మెట్ల కింద ఇలాంటివి పెట్టొచ్చా? దీని వలన ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మెట్ల కింద కొన్ని పెట్టడం వలన ప్రతికూల శక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా మె...