భారతదేశం, జూన్ 30 -- ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం రెండు కళ్లు వంటివి. ఇవి రెండూ లోపిస్తే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. అయితే మనం చేసే కొన్ని రోజువారీ పనులు మన ప్రమేయం లేకుండానే దరిద్రానికి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, మనిషి అలవాట్లు అతని ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అదృష్టాన్ని దూరం చేసుకుని, ఆర్థికంగా నష్టపోయేలా చేసే ఆ ఐదు పొరపాట్లు ఏంటో చూద్దాం.

చాలామందికి భోజనం పూర్తయ్యాక అదే ప్లేటులో చేయి కడుక్కునే అలవాటు ఉంటుంది. ఇది అత్యంత అశుభమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, ఫలితంగా ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని పెద్దల నమ్మకం. అంతేకాకుండా, వంటగదిలోని సింక్‌లో నోటిని శుభ్రం చేసుకోవడం వంటివి ఇంట్లోని సిరిసంపదలను హరి...