భారతదేశం, జూన్ 6 -- ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి మనం రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటాం. కొందరు లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెడితే, మరికొందరు ఏడు గుర్రాల పెయింటింగ్ తగిలిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అవి మన ఇంట్లోని శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఇల్లు లేదా ఆఫీసుల్లో డెకరేషన్ కోసం అందమైన ఓడ చిత్రాలను వాడుతుంటారు. అయితే, ఈ ఓడ బొమ్మను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఓడ చిత్రాన్ని ఏ దిశలో ఉంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రంలో సముద్రంలో ప్రయాణించే ఓడను ఉన్నతికి, జీవితంలో ముందుకు సాగడానికి ప్రతీకగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని (...