Andhrapradesh, సెప్టెంబర్ 25 -- వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిజిటల్‌ బుక్‌ యాప్‌‌ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు. తమ ఇబ్బందులను ఈ యాప్ పార్టీ దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా రూపొందించారు. బుధవారం ఈ డిజిటల్ బుక్ యాప్ ను జగన్ ప్రారంభించారు.

కార్యకర్తలు ఎదుర్కొంటున్న రాజకీయ వేధింపులు, అన్యాయాల సంఘటనలను డాక్యుమెంట్ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు జగన్ తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని వ్యాఖ్యానించారు.

ఆన్‌లైన్ పోర్టల్ ( https://digitalbook.weysrcp.com/auth/phone ) ద్వారా కార్యకర్తలు, నాయకులు తమ ఎదుర్కొన్న అన్యాయాలను నేరుగా డాక్...