భారతదేశం, ఆగస్టు 17 -- రోజువారీ పనుల ఒత్తిడిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలామందికి కష్టమైన పని. కానీ, ఆదివారం కాస్త సమయం కేటాయించి ముందుగానే ప్లాన్ చేసుకుంటే, వారం మొత్తం ఆహారం విషయంలో టెన్షన్ లేకుండా ఉండొచ్చని అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్లీన్ కౌర్. ఈ ఒక్క ప్లానింగ్‌తో వారం మొత్తం మీరు, మీ కుటుంబం హాయిగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.

కొంతమందికి ఆదివారాలు బద్ధకంగా గడిచిపోతే, మరికొందరికి మాత్రం అటూఇటూ పరుగులు తీస్తూ గజిబిజిగా ఉంటాయి. ఏదేమైనా, ఒకట్రెండు గంటలు కేటాయించి రాబోయే వారానికి అవసరమైన భోజనాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటే, వారం మొత్తం ఒత్తిడి లేకుండా గడిచిపోతుంది. చాలామందికి, ఆఫీసు పనులు, ఇంటి పనుల మధ్యలో తినే సమయం కూడా దొరకదు. అప్పుడు ఏదో ఒక చిన్న ఫుడ్ ప్యాకెట్ లాగించేస్తుంటారు. కానీ, న్యూట్రిషనిస్ట్ లవ్లీన్ కౌర్ మాత్రం ఆదివారాన్...