భారతదేశం, ఆగస్టు 18 -- బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అయితే ఇది మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్ననికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది.

మరోవైపు ఉత్తరాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ఏజెన్సీ ...