భారతదేశం, సెప్టెంబర్ 25 -- వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది గురువారం ఉదయంనాటికి బలహీనపడుతుంది. ఇంకోవైపు తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదులుతుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీనితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నెల 30 తేదీ వరకు దీని ప్రభావం ఉండనుంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. 'ఇది దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ సెప్టెంబర్ 26న దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దూసుకెళ్లి వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వా...