భారతదేశం, సెప్టెంబర్ 26 -- క్రెడిట్ కార్డులను బాధ్యతాయుతంగా వాడితే అత్యవసర సమయాల్లో ఆర్థిక కొండంత అండగా నిలుస్తాయి. అయితే ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండి, అందులో ఏదైనా ఒక దానిని అస్సలు వాడకపోతే దానిని రద్దు చేసుకోవడమే మేలని చాలామంది భావిస్తుంటారు. వాలెట్‌లో ఖాళీగా పడి ఉండటం లేదా ఎక్కడైనా పోతుందేమోనన్న భయంతో కార్డు ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటారు. అయితే, వాడని క్రెడిట్ కార్డును రద్దు చేయడం అనేది అంత సులువైన నిర్ణయం కాదని, ఇది మీ మొత్తం అప్పు తీసుకునే సామర్థ్యంతో పాటు సిబిల్ స్కోర్‌పై (CIBIL Score) తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కార్డు రద్దు చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం 'క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో' (Credit Utilisation Ratio - CUR). మీ వద్ద ఉన్న అన్ని క్రెడిట్ కార్డుల మొత్తం లిమిట్‌...