భారతదేశం, జూన్ 16 -- మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన అప్డేట్స్ ట్యాబ్‌లో అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే స్టేటస్, ఛానల్స్‌కు అంకితమైన ఈ ట్యాబ్‌ను ఇప్పుడు మరింత ఉపయోగకరంగా, ఆసక్తికరంగా మార్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ ట్యాబ్‌లో గత ఏడాది కాలంలో చేసిన మార్పులు వాట్సాప్‌లో కొత్తగా ఏదైనా సెర్చ్ చేసే అనుభవాన్ని యూజర్లకు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 1.5 బిలియన్లకు పైగా ప్రజలు ఈ అప్డేట్స్ ట్యాబ్‌ను ఉపయోగిస్తున్నారని యాప్ పేర్కొంది. ఈ ఫీచర్‌ను రోజూ ఉపయోగించే అడ్మిన్లు, గ్రూపులు, వ్యాపారాలకు మరింత మద్దతును అందించడమే లక్ష్యంగా మార్పులు చేశారు. అయితే ఈ ఫీచర్లన్నీ అప్‌డేట్స్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. మీరు వాట్సాప్‌ను కేవలం పర్సనల్ చాట్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తే ఈ మార్పుల...