భారతదేశం, జూన్ 29 -- వాట్సాప్ నుంచి డాక్యుమెంట్లను పంపడానికి వేరే యాప్స్ ఉపయోగించాలి. అయితే ఇందుకోసం వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. వాట్సాప్ కొత్త ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ వాబెటాఇన్ఫో నివేదిక ప్రకారం.. డాక్యుమెంట్లను స్కాన్ చేసే ఫీచర్ వాట్సాప్‌లో వస్తుంది. దీని కోసం ఇప్పటివరకు థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చింది.

వాట్సాప్ ఇప్పుడు తన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది యాప్ నుండి నేరుగా డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి, పీడీఎఫ్ ఫైల్స్‌ను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. కొన్ని నెలలుగా ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ ప్రవేశపెట్టడంతో థర్డ్ పార్టీ డాక్యుమెంట్ స్కానర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

ఇప్పుడు ఇమేజ్‌ను వాట్సాప్ నుంచే డాక్యుమెంట్‌గా మార్చుకోవచ్చు....