భారతదేశం, సెప్టెంబర్ 8 -- దేశంలో సరిగా వర్షాలు పడకపోవడం విద్యుత్ రంగాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. తీవ్రమైన ఉక్కపోతతో ఇళ్లలో ఏసీల వాడకం నిరంతరం సాగుతుండటం, పంటలను కాపాడుకునేందుకు రైతులు వ్యవసాయ పంపుసెట్లను పెద్ద ఎత్తున వాడటంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. సెప్టెంబరు మొదటి వారంలోనే డిమాండ్ 256 గిగావాట్లకు చేరడంతో రోజుకు 20 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ కొరత ఏర్పడుతోంది.

వరి పంటకు అత్యంత కీలకమైన సమయంలో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలను తోడేందుకు రైతులు పంపుసెట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనికి తోడు వాతావరణంలో తేమ పెరిగి ఉక్కపోతగా ఉండటంతో పట్టణాలు, నగరాల్లో ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. మే నెలలో దేశీయ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 270.8 గిగావాట్లను తాకింది. జులై, ఆగస్టు నెలల్లో కాస్త తగ్గినా, సెప్టెంబరు మొ...