భారతదేశం, జనవరి 20 -- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్-యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ పని చేసేందుకు అల్ మార్రీ అంగీకారం తెలిపారు. అలాగే యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్ మార్రీకి ముఖ్యమంత్రి వివరించారు.

యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ మోడల్ లాజిస్ట...