వరలక్ష్మీ వ్రతం 2026.. పూజా ముహూర్తం, విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ ముహూర్తాల్లో పూజిస్తే శుభ ఫలితాలు!
భారతదేశం, ఆగస్టు 12 -- హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో పవిత్రత ఉంటుంది. శుక్రవారాల నాడు ఆ తల్లి అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అలా పూజిస్తే కుటుంబంలో సిరిసంపదలు వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ వివాహిత మహిళలు ఈ నోమును ఆచరిస్తారు.
ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ వ్రతం. కేవలం సాధారణ వ్రతంలా కాకుండా, ఈసారి ఎన్నో అరుదైన ఖగోళ సంయోగాలు ఈ పండుగ రోజున ఏర్పడుతుండటం విశేషం.
ఏ పండగైనా, వ్రతమైనా సరైన ముహూర్తంలో ఆచరిస్తేనే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున స్థిర లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది.
ముఖ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.