భారతదేశం, ఆగస్టు 8 -- తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరలక్ష్మీ వ్రత పండుగ మెుదలైంది. వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా ఇళ్లను అలంకరించుకుని, సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా చాలా ఫలితాలను పొందుతారు. ఈ వరలక్ష్మీ వ్రతం మీ సంతోషాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధుమిత్రులకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు చెప్పండి.

లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటికి సంపద, శ్రేయస్సును, మీ కెరీర్‌లో విజయాన్ని తీసుకురావాలి. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

వరమహాలక్ష్మి దేవి మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, సంపద, శాంతి, శ్రేయస్సును ప్రసాదించుగాక. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

ఆది లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, శౌర్యలక్ష్మి, కార...