భారతదేశం, ఆగస్టు 20 -- శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. వరలక్ష్మీ వ్రతాన్ని ఉదయం పూట, అందులో బ్రహ్మ ముహూర్తంలో వేళ్లేదా, శుభ ముహూర్తంలో చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది. రేపు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే, సరైన సమయానికి చేసుకోవడం చాలా ముఖ్యమైనది. వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో ఆచరిస్తే మంచిది? పూజకు అనుకూలమైన ఉత్తమ సమయాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.

దుర్ముహూర్తం, రాహుకాలం సమయంలో చేసుకోకూడదు. దుర్ముహూర్తం, రాహుకాలం సమయంలో నూతన కార్యాచరణ లేదా కలశ ప్రతిష్ఠ వంటి ముఖ్యమైన ఘట్టాలను ప్రారంభించకూడదు.

బ్రహ్మ ముహూర్తం: ఉదయం వేళ వరలక్ష్మీ వ్రతం ఆచరించాలనుకునే వారు బ్రహ్మ ముహూర్తం లేదా ఉదయం పూట వ్రతం చేసుకోవడానికి సరైన సమయం. పూజకు అత్యంత ప్రశస్తమైన సమయం ఉదయం నాలుగు నుంచి ఎనిమిది వరకు. ఈ సమయంలో మనసు ప్రశాం...