భారతదేశం, సెప్టెంబర్ 21 -- హైదరాబాద్‌లో వరద బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చేశాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రుతుపవనాల సంసిద్ధతలో నిర్లక్ష్యం, సహాయక చర్యలు లేకపోవడం వంటివి ఉన్నాయన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్నీ క్లీన్ చేయించేవారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల నాలాల నుండి వరద వచ్చిందన్నారు.

'ఈ వరద వల్ల ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయి. తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం కూడా వరద బాధితులకు చేయలేదు. హైదరాబాద్ నగరంలో 7-8 మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారు. ఆ చావులకు కారణం రేవంత్ రెడ...