భారతదేశం, ఏప్రిల్ 10 -- వరంగల్ లో వెలుగు చూసిన భార్య, ఇద్దరు బాలికల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో భర్తనే ప్రధాన నిందితుడు కాగా. సహకరించిన మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ నగర కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా(09), ఆయేషా(06) జన్మనిచ్చారు. కాని నిందితుడి కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలని కోరిక ఉండేది.

2021, 2022 సంవత్సరాల్లో మృతురాలు గర్భం దాల్చడంతో తిరిగి అడపిల్ల జన్మనిస్తుందనే అపనమ్మకంతో అబార్షన్ చేయించారు. ఇందుకు ఆర్ఎంపీ డాక్టర్ నరేశ్, ల్యాబ్ టెక్నిషియన్ మనోహర్, ...