భారతదేశం, అక్టోబర్ 2 -- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ రికార్డ్ సృష్టించారు. 500 బిలియన్ డాలర్ల నికర విలువను ఉన్న ప్రపంచంలో మొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. ఎలాన్ మస్క్ సంపద బుధవారం, అక్టోబర్ 1, 2025న 500 బిలియన్ డాలర్లు మార్కును తాకింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ రోజున ఆయన సంపద 500.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఆ తర్వాత అది 499.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఎలాన్ మస్క్ సంపదలో ఈ పెరుగుదల ప్రధానంగా మూడు కంపెనీలలో అతని వాటా కారణంగా వచ్చింది. టెస్లా: టెస్లా కంపెనీ షేర్లు ఈ సంవత్సరం 14 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. బుధవారం మాత్రమే 3.3 శాతం పెరుగుదల మస్క్ సంపదకు సుమారు 6 బిలియన్ డాలర్లను జోడించింది. టెస్లాలో మస్క్ కు 12.4 శాతం వాటా ఉంది.

స్పేస్ ఎక్స్: స్పేస్ ఎక్స్ ఆగస్టు 2025 నాటికి 400 బిలియన్ డా...