భారతదేశం, జనవరి 12 -- స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన అభిమానుల కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2026 రిపబ్లిక్ డేను పురస్కరించుకుని 'వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్' (OnePlus Freedom Sale) ను కంపెనీ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులు లభించనున్నాయి. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన OnePlus 15 సిరీస్, Nord 5, OnePlus 13 మోడల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రత్యేక సేల్ జనవరి 16, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, Myntra, బ్లింకిట్‌లతో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ OnePlus.in లోనూ ఈ ఆఫర్లు లభిస్తాయి. ఆఫ్‌లైన్‌లో వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్రముఖ అవుట్‌లెట్లలో కూడ...