భారతదేశం, జూన్ 29 -- వట పౌర్ణిమ 2026: జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు పెళ్లయిన మహిళలు భక్తిశ్రద్ధలతో వట పౌర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. భర్త ఆయురారోగ్యాల కోసం, సుఖమైన దాంపత్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను, పురాణ గాథలను ఇప్పుడు తెలుసుకుందాం.

సనాతన ధర్మంలో వృక్షాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో మర్రి చెట్టుకు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా దీనిని భావిస్తారు. ఈ వృక్షం దైవికమైన శక్తిని కలిగి ఉంటుందని నమ్మకం. ఈ చెట్టు వేళ్లల్లో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని విశ్వాసం. అందుకనే ఒకసారి మర్రి వృక్షాన్ని ఆరాధించడం త్రిమూర్తులను ఆరాధించినంత పుణ్యఫలాన్ని ఇస్తుందని భావిస్తారు. మహిళలు వట పౌర్ణిమ నాడు మర్రి చెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు....