Hydarabad, Oct. 24 -- ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పలు సంస్కరణలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ , ప్రాక్టికల్స్, ఇంటర్నల్ మార్కులు వంటి కీలక అంశాల్లో మార్పులు జరగనున్నాయి.

కొన్ని రోజుల కిందట ఈ అంశంపై చర్చ జరిగింది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. మార్పులపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపింది. వీటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-27 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.

ఇంటర్మీడియట్‌లో అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం రాత పరీక్ష ఉంటుంది. మిగిలిన 2...