భారతదేశం, సెప్టెంబర్ 5 -- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 90 సీట్లు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగి స్థానాల సంఖ్య పెరిగితే ఏకంగా 117 స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తన విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ కార్యకర్తలు నీకు తిరుగులేని రీతిలో సమాధానం చెబుతారు. వారు ఎన్నడూ వెనకడుగు వేయరు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ శ్రేణులు రాజకీయంగా ...