భారతదేశం, మార్చి 16 -- భారతీయ రైల్వే తన రూపురేఖలను వేగంగా మార్చుకుంటోంది. ముఖ్యంగా సెమీ హైస్పీడ్ రైలైన 'వందే భారత్' విషయంలో ప్రయాణికుల సౌకర్యాల కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే శాఖ చేసిన ఒక చిన్న మార్పు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దశాబ్దాలుగా రైళ్లలో కనిపిస్తున్న తెల్లటి బెడ్ షీట్ల స్థానంలో, ఇప్పుడు రంగురంగుల ఆకర్షణీయమైన దుప్పట్లు (Bedding) వచ్చి చేరాయి.

సాధారణంగా ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ దుప్పటి, దిండు, బెడ్ షీట్లను ఉచితంగా అందిస్తుంది. అయితే ఇవన్నీ ఎప్పుడూ తెల్లటి రంగులోనే ఉండేవి. దీనిపై ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ (ఓయింద్రిలా దత్తా) పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తన వీడియోకు "ఇకపై 3 ఏసీ కోచ్‌లలో మార్చురీ లాంటి వాతావరణం ఉండదు" అ...