భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రెగ్యూలర్ బెయిల్ ఇచ్చింది కోర్టు.

రెండు లక్షల పూచీకత్తుతోపాటుగా రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు వారానికి రెండుసార్లు విచారణకు హాజరు కావాలని, వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పింది. సుమారు 71 రోజులుగా జైలులో ఉన్న మిథున్ రెడ్డి మంగళవారం ఉదయం జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి 2025 జులై 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడలోని కార్యాలయంలో సిట్ అధికారులు సుమారు 7 గంటలకుపైగా విచారణ చేశారు. అదే రోజు రాత్రి మిథున్ రెడ్డిని...