భారతదేశం, ఆగస్టు 13 -- ఉద్యోగాలు ఊడటం ఒక ఎత్తైతే, ఆ తర్వాత కంపెనీల నుంచి ఎదురయ్యే అనుభవాలు ఉద్యోగులను తీవ్రంగా కలచివేస్తుంటాయి. ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక టెకీకి ఇలాంటి తీవ్ర అసంతృప్తికర అనుభవమే ఎదురైంది. లేఆఫ్‌కు గురైన అతడు, ఆఫీస్ లాప్‌టాప్ తిరిగి ఇచ్చేందుకు తన రెండేళ్ల కుమారుడితో వెళ్లగా, ఆ చిన్నారిని భవనంలోకి అనుమతించలేదు.

సదరు ఉద్యోగి రెడిట్ (Reddit) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు. భార్య కూడా ఉద్యోగం చేస్తుండటంతో, ఇంట్లో పిల్లాడిని చూసుకునేవారు లేక తప్పనిసరి పరిస్థితుల్లో తన రెండేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు.

ఆఫీస్ ప్రాంగణానికి చేరుకోగానే పిల్లాడిని లోపలికి రానివ్వమని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. "ఇది నా చివరి రోజు, కేవలం లాప్‌టాప్‌ ఇచ్చేసి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను" అని వేడుకున్నా...