భారతదేశం, నవంబర్ 14 -- హీరోగా, డైరెక్టర్‌గా ఒకేసారి పరిచయం అయ్యారు అనీష్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ లవ్ ఓటీపీ. విజయ్ ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్విక నటించింది. అలాగే, నటుడు రాజీవ్ కనకాల, ఆరోహి నారాయణ్, ప్రమోదిని, నాట్య రంగ, బాబా భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇవాళ (నవంబర్ 14) లవ్ ఓటీపీ సినిమా థియేటర్లలో, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి లవ్ ఓటీపీ రివ్యూలో తెలుసుకుందాం.

అక్షయ్ (అనీష్)కు క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. అక్షయ్ తండ్రి (రాజీవ్ కనకాల) పోలీస్ ఆఫీసర్. లవ్ అంటే ఏమాత్రం పడదు. అందుకే ప్రేమ పేరుతో వచ్చే కేసులను చాలా స్పెషల్ కేర్ తీసుకుంటాడు. తండ్రి మీద భయంతో అక్షయ్ ఎవ...