భారతదేశం, ఆగస్టు 11 -- దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటిలో పీఎం క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి. ఈ పథకం కింద సోమవారం డిజిటల్ పేమెంట్ ద్వారా 35 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3900 కోట్ల బీమా మొత్తాన్ని బదిలీ చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద క్లెయిమ్ చెల్లింపు కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలకు బీమా మొత్తాన్ని డిజిటల్‌గా చెల్లించారు.

ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు, లబ్ధిదారులు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క పథకం ద్వారానే కాకుండా వివిధ పథకాల ద్వారా రైతుల జీవితాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారు. ప్రధాన మంత్...