భారతదేశం, మే 21 -- Sun Transit Rohini Nakshatra 2026 : జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పునకు కాలం ఆసన్నమైంది. గ్రహాల రాజు, ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 08 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. సూర్యుడు చంద్రుడి నక్షత్రంలోకి మారడాన్ని జ్యోతిష్య నిపుణులు అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తారు. నవగ్రహాలలో సూర్యుడిని ఆత్మగౌరవానికి, ధైర్యానికి, కీర్తి ప్రతిష్టలకు, అధికారానికి కారకుడిగా పరిగణిస్తారు. అందుకే సూర్యుడి నక్షత్ర పరివర్తనం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

ముఖ్యంగా ఈ నక్షత్ర మార్పుతో మూడు రాశుల వారికి అపారమైన సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. సూర్యుడి శుభ ప్రభావం కారణంగా వీరు కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని, సమాజంలో ...