భారతదేశం, ఆగస్టు 25 -- సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన శైలితో ఆకట్టుకునే నటి శోభిత ధూళిపాళ్ల వ్యక్తిగత జీవితంలో అత్యంత ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంటారు. తాజాగా 'వోగ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగం గురించి, మానసిక ఆరోగ్యం కోసం పాటించే ప్రత్యేక అలవాట్ల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.

సోషల్ మీడియా రీల్స్, డిజిటల్ స్క్రీన్‌ల దాడి ఎక్కువైన ఈ కాలంలోనూ శోభిత రోజుకు ఏకంగా మూడు గంటలు పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నారు. ఫిజికల్ పుస్తకాలు (Paperbacks), సబ్‌స్టాక్ ఆర్టికల్స్ చదవడం ఆమె దినచర్యలో భాగం. ఐప్యాడ్ లేదా కిండిల్ వంటి డిజిటల్ పరికరాల్లో చదవడానికి ఆమె సుముఖంగా లేరు.

"పుస్తక పేజీలను తిప్పుతూ చదవడమే నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. కిండిల్ వాడే ప్రసక్తే లేదు" అని శోభిత స్పష్టం చేశారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఎండలో గడ...