భారతదేశం, అక్టోబర్ 28 -- రైలు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో రైళ్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా బంద్ చేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలను ఆదేశించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లను స్విచ్ ఆఫ్ ఉంచాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.

ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్‌ఈఆర్) పరిధిలో సిబ్బంది రాత్రి వేళ ఛార్జింగ్ పాయింట్లను బంద్ చేయకపోవడంతో ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అవుతూ ఒక్కసారిగా పేలి దట్టమైన పొగలు వచ్చాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు అక్టోబర్ 26న ప్రత్యేక లేఖ రాసింది.

"అన్ని జోనల్ రైల్వేలు సంబంధిత సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేయాలి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ...