రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈ సమయాల్లో ట్రైన్లలో ఛార్జింగ్ పాయింట్లు ఆఫ్
భారతదేశం, అక్టోబర్ 29 -- భారతీయ రైల్వే ట్రైన్లలో ఛార్జింగ్ పాయింట్ల గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రైలు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచుకోవడానికి అనుమతించరు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా ఆపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
రాత్రిపూట ప్రయాణాల సమయంలో కోచ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని బోర్డు ఒక అధికారిక ప్రకటనలో రైల్వే అధికారులను ఆదేశించింది. అధికారులు, పర్యవేక్షక సిబ్బంది ఈ ఆదేశాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మినహాయింపులకు తావులేదని చెప్పారు.
రాత్రిపూట ప్రయాణ సమయంలో మొబైల్ ఛార్జింగ్ సర్క్యూట్‌లను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఒక దశాబ్దానికి ముందే సర్క్యులర్ జారీ చేసినట్టుగా సీనియర్ రైల్వే అధిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.