భారతదేశం, ఏప్రిల్ 26 -- South Central Railway New Trains : తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.... ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ టౌన్ నుంచి కర్ణాటకలోని మైసూర్ వరకు కొత్త బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (Train Nos. 17289/17290) అందుబాటులోకి తెచ్చింది. గతంలో స్పెషల్ ట్రైన్ సర్వీసుగా (07033/07034) కొనసాగిన ఈ సర్వీసును రైల్వే బోర్డు ఇప్పుడు క్రమబద్ధీకరించి.... శాశ్వత ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చింది.

ఈ కొత్త రైలు సర్వీసులు మే నెల ప్రారంభం నుంచి పట్టాలెక్కనున్నాయి. బయల్దేరే సమయం, ఆగే స్టేషన్లు, ఇతర వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి....

కాకినాడ టౌన్‌లో ఉదయం 09:00 గంటలకు బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు సాయంత్రం 16:00 గంటలకు మైసూర్ చేరుకుంటుంది. మైసూరు నుంచి ప...